Detel D1 TV: రూ.3,999 లకే 19 అంగుళాల ఎల్సీడీ టీవీ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-1474346cbc6b84810400960f983f41fdb6ac52f8.jpg?format=auto)
- మార్కెట్లో విడుదలైన డీటెల్ డీ1
- యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్ల సపోర్ట్
- డీటెల్ అధికారిక వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ సంప్రదించాలి
డీటెల్ సంస్థ రూ.3,999 లకే నూతన డీటెల్ డీ1 ఎల్సీడీ టీవీని తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. 19 అంగుళాలు గల ఈ టీవీని కంప్యూటర్ మానిటర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ధర మొదట్లో రూ.4,999 ఉన్నప్పటికీ, ఇప్పుడు రూ.3,999 ధరకే నిర్ణయించారు. దీనిలో యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్లు కూడా ఉన్నాయి. ఈ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు డీటెల్ అధికారిక వెబ్ సైట్ గాని, మొబైల్ యాప్ గాని సంప్రదించాలి. అలాగే, డిస్ట్రిబ్యూటర్లు, పార్ట్నర్లు B2BAdda.com అనే వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-01c920d4a61eee1663a8d70f15e5f549b4007cf1.jpg)