Eiffel Tower: ఈఫిల్ టవర్ మెట్ల వేలం.. నిర్వాహకులకు షాక్!
- 2016లో 14 మెట్ల వేలం
- 5,23,800 యూరోలకు కొనుగోలు
- తాజాగా భారీ ధర పలికిన మెట్లు
1983లో ఈఫిల్ టవర్లోని కొన్ని మెట్లను లిఫ్ట్ ఏర్పాటు చేసే క్రమంలో తొలగించారు. అప్పట్లో వాటిలో కొన్నిటిని మ్యూజియంలో ఉంచేందుకు తీసుకెళ్లారు. మరికొన్నింటిని పలు చారిత్రాత్మక ప్రాంతాల్లో అమర్చారు. అనంతరం 2016లో ఆర్ట్కరియల్ అనే సంస్థ తొలగించిన 14 మెట్లను వేలం వేయగా 5,23,800 యూరోలకు అమ్ముడుపోయాయి.
తాజాగా మరికొన్ని మెట్లను వేలానికి పెట్టగా భారీ ధర పలికింది. ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువగా ధర పలికింది. 1,69,000 యూరోలు అంటే మన కరెన్సీలో రూ.1.34కోట్లు చెల్లించి మధ్య ప్రాచ్యానికి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ఈఫిల్ టవర్లోని రెండు, మూడు అంతస్తుల మధ్య గతంలో తొలగించిన దాదాపు 25 ఇనుప మెట్లను ఆర్ట్కరియల్ సంస్థ వేలం వేసింది. ఈ వేలంలో మెట్లు 40 నుంచి 60 వేల యూరోలు పలుకుతాయని భావించిన సంస్థకు షాక్ కలిగేలా మూడు రెట్ల ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం విశేషం!