election commission: ఐటీ కారిడార్‌ ఉద్యోగుల ఓటింగ్‌పై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి

  • నేడు సీఈఓలతో ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ప్రత్యేక భేటీ
  • కారిడార్‌లో లక్ష మందికి ఓటు హక్కు
  • ఎన్నికల రోజు సెలవు మంజూరు చేయొద్దని సూచన

దాదాపు లక్ష మందికి ఓటు హక్కు ఉన్న సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఐటీ కారిడార్‌ సిబ్బందిపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఏదో ఒక కారణంతో ఉద్యోగులు ఓటింగ్‌కు దూరం కాకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అవసరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కమిషనరేట్‌లో ఐటీ కంపెనీల సీఈఓలతో సమావేశం కావాలని నిర్ణయించారు.

సైబరాబాద్‌ పోలీస్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు డిసెంబరు 7న అంటే శుక్రవారం జరుగుతున్నాయి. ఐటీ కంపెనీలకు శని, ఆదివారాలు వారాంతపు సెలవు. కావును వీకెండ్‌కు ముందూ, వెనుక రోజుల్లో ఉద్యోగులు సెలవు పెట్టే అవకాశాలు ఎక్కువ. వీకెండ్‌కు ముందు రోజున ఎన్నికలు జరుగుతున్నందున సిబ్బందికి శుక్రవారం సెలవు మంజూరు చేయకుండా, ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఎన్నిక అధికారి సీఈఓలను కోరనున్నారు.

  • Loading...

More Telugu News