Yadadri Bhuvanagiri District: వ్యభిచారాన్ని తీవ్ర నేరంగా పరిగణించలేం... పీడీ యాక్ట్‌ సరికాదు : హైకోర్టు

  • వ్యభిచార గృహాల నిర్వాహకులపై చట్ట ప్రయోగాన్ని తప్పుపట్టిన కోర్టు
  • చట్టం అమలు చేసేటప్పుడు సహేతుకత పాటించాలి
  • మహిళ జీవించే స్వేచ్ఛను హరించవద్దని హితవు

వ్యభిచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించలేమని, అటువంటి కేసులపై పీడీ యాక్ట్‌ ప్రయోగం అర్థరహితమని హైకోర్టు స్పష్టం చేసింది. యాదాద్రిలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిని పట్టుకుని వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడమేకాక, మహిళలను నిర్బంధించి జైలులో ఉంచడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. చట్టం అమలు చేసేటప్పుడు సహేతుకత పాటించాలని, చట్టం పేరుతో మహిళల జీవించే స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కోర్టు హెచ్చరించింది.

 చిన్నపిల్లల్ని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఆరోపిస్తూ యాదాద్రికి చెందిన నలుగురు మహిళలపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ మహిళ తరపున బంధువులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరును తప్పుపట్టింది. అలజడులు, అశాంతికి కారణమయ్యే తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భాల్లోనే నిందితులపై ఈ చట్టాన్ని ప్రయోగించాలని గుర్తు చేసింది.

  • Loading...

More Telugu News