Honor 8C: ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన 'ఆనర్ 8సీ' స్మార్ట్ ఫోన్!
- నేడు భారత మార్కెట్లో విడుదల
- నాలుగు రంగులలో లభ్యం
- వచ్చేనెల 10 నుండి అమెజాన్ లో విక్రయం
ఆనర్ సంస్థ గత నెల చైనాలో విడుదల చేసిన 'ఆనర్ 8సీ' స్మార్ట్ ఫోన్ ని తాజాగా నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. అరోరా బ్లూ, మేజిక్ నైట్ బ్లాక్, ప్లాటినం గోల్డ్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ను వచ్చే నెల 10 నుండి అమెజాన్ లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.11,999గా ఉంది. అలాగే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.12,999గా నిర్ణయించారు.
ఆనర్ 8సీ ప్రత్యేకతలు:
- 6.26" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1520 x 720 పిక్సల్స్)
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్
- 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- 13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ