shakalaka shankar: ముగింపు దశలో షకలక శంకర్ 'డ్రైవర్ రాముడు'

  • షకలక శంకర్ హీరోగా 'డ్రైవర్ రాముడు'
  • దర్శకుడిగా రాజ్ సత్య
  • ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి           

ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై కమెడియన్ గా షకలక శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్ కారణంగా హీరోగా అవకాశాలు రావడంతో, తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో వున్నాడు. ప్రస్తుతం ఆయన 'డ్రైవర్ రాముడు' సినిమా చేస్తున్నాడు. రాజ్ సత్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, చివరి షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది.

రంపచోడవరం .. మారేడుమిల్లి .. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. అంచల్ సింగ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో షకలక శంకర్ వున్నాడు. హీరోగా నిలదొక్కుకోవాలని షకలక శంకర్ ప్రయత్నం ఈ సినిమాతోనైనా ఫలిస్తుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News