Petrol: ఆరు వారాల్లో రూ. 10 తగ్గిన పెట్రోలు ధర!
- ఆరు వారాలుగా తగ్గుతూ వచ్చిన ధరలు
- శుక్రవారం నాడు 37 పైసలు తగ్గిన పెట్రోలు ధర
- డీజిల్ ధరలో 41 పైసలు తగ్గుదల
సరిగ్గా ఆరు వారాల క్రితం రూ. 83 నుంచి రూ. 90 మధ్య ఉన్న పెట్రోలు ధర ఇప్పుడు రూ. 73 నుంచి రూ. 80 స్థాయికి దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు గణనీయంగా దిగిరాగా, దాని ప్రభావంతో భారత దేశవాళీ మార్కెట్లో సైతం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతూ వచ్చాయి.
శుక్రవారం నాడు కూడా ధరలు తగ్గాయి. నేడు లీటరు పెట్రోలుపై రూ. 37, డీజిల్ పై 41 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 72.87కు, డీజిల్ ధర రూ. 67.72కు చేరుకుంది.
ఇక ముంబై విషయానికి వస్తే, పెట్రోలు రూ. 78.43కు, డీజిల్ రూ. 70.89కి చేరింది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 75.62కు, డీజిల్ ధర రూ. 71.52కు తగ్గగా, హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 77.25గా, డీజిల్ ధర రూ. 73.68గా ఉంది.