election commission: పోలింగ్‌ రోజు పంపిణీ చేసే ఎన్నికల చీటీలకు కొత్త రూపు

  • ఓటరు పేరు, తండ్రి పేరుతోపాటు అదనపు సమాచారం
  • ఈసీ చిరునామా, హెల్ప్‌లైన్‌ నంబర్‌, బీఎల్‌ఓ ఫోన్‌ నంబరు వివరాలు
  • చీటీ వెనుక పోలింగ్‌ కేంద్రం రూట్‌ మ్యాప్‌

బోగస్‌ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోలింగ్‌ రోజు పంపిణీ చేసే ఎన్నికల చీటీలను కొత్త విధానంలో ముద్రించింది. గతంలో ఎన్నికల రోజున ఓటర్లకు అందించే ఈ స్లిప్‌లో ఓటరు పేరు, తండ్రిపేరు, పోలింగ్‌ కేంద్రం పేరుతో చిన్న చీటీలను అందించే వారు. ఈ సారి అలాకాకుండా ఓటరు వివరాలు, కేంద్రం వివరాలు, రూట్‌మ్యాప్‌, ఈసీ వెబ్‌సైట్‌, బీఎల్‌ఓ ఫోన్‌ నంబరు వివరాలు కూడా ముద్రిస్తున్నారు.

 అనుమానాల నివృత్తికి జిల్లా ఎన్నికల అధికారి హెల్ప్‌లైన్‌ నంబర్‌ పొందుపరిచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం  టోల్ ఫ్రీ నంబర్ కూ చోటు కల్పించారు. చీటీ వెనుక భాగంలో పోలింగ్‌ కేంద్రం చిత్రపటాన్ని ముద్రించారు. దీని ప్రకారం ఓటరు ఏ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చో తెలుసుకోవచ్చు. దీనిపక్కనే ఆ పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌వో) పేరు, ఫోన్ నంబరు పొందుపరిచారు. ఓటు వేసే సమయంలో ఏదైనా సమస్య, అనుమానం వచ్చినా ఆ నంబర్‌లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఓటుకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News