KCR: కేసీఆర్... సమాధానం చెప్పు: చంద్రబాబునాయుడు
- అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారన్న కేసీఆర్
- ఎక్కడ అడ్డుపడ్డానో చెప్పాలని చంద్రబాబు సవాల్
- ట్విట్టర్ లో ఏపీ సీఎం వ్యాఖ్యలు
తెలంగాణ అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అడ్డుపడుతున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ, అభివృద్ధికి తాను ఎక్కడ అడ్డంకిగా నిలిచానో చెప్పాలని సవాల్ విసిరారు చంద్రబాబు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు.
"దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే నేను అడ్డుపడ్డానా? కేసీఆర్ దళితుడిని సీఎంను చేస్తానంటే నేను అడ్డుపడ్డానా? తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నేను అడ్డుపడ్డానా? నేను ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్ సమాధానం చెప్పాలి" అని వ్యాఖ్యానించారు.
"తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్ ఒక్క పనైనా చేశారా? ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంటే కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీశారా? అవేమీ చేయకుండా హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ది చేసిన నాపై విమర్శలు చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు" అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే నేను అడ్డుపడ్డానా? కేసీఆర్ దళితుడిని సీఎంను చేస్తానంటే నేను అడ్డుపడ్డానా? తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నేను అడ్డుపడ్డానా? నేను ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్ సమాధానం చెప్పాలి. pic.twitter.com/QvZW4O4MQ6
— N Chandrababu Naidu (@ncbn) December 1, 2018
తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్ ఒక్క పనైనా చేశారా? ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంటే కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీశారా? అవేమీ చేయకుండా హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ది చేసిన నాపై విమర్శలు చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. pic.twitter.com/kqLdnvif4C
— N Chandrababu Naidu (@ncbn) December 1, 2018