Revanth Reddy: రేవంత్ నలుగురు సోదరులతో పాటు, 140 మంది కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు: కుంతియా

  • వారెంట్ కూడా లేకుండానే అరెస్ట్ చేశారు
  • పీఎం, సీఎంలు వస్తే అరెస్ట్ చేయాలని ఎక్కడుంది?
  • కాంగ్రెస్ నేతలంతా మండల కేంద్రాల్లో నిరసన చేపట్టాలి

విపక్ష నేతలను భయపెట్టేందుకే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా మండిపడ్డారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, వారెంట్ కూడా లేకుండానే రేవంత్ ను అరెస్ట్ చేశారని విమర్శించారు. తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేయడం దారుణమని తెలిపారు. ఇది అత్యంత నీచమైన చర్య అని అన్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి వస్తే అరెస్ట్ చేయాలనే నిబంధన ఎక్కడుందని ప్రశ్నించారు. రేవంత్ నలుగురు సోదరులతో పాటు, 140 మంది కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ నేతలంతా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News