Kamal Haasan: కమలహాసన్ సంచలన నిర్ణయం.. ‘భారతీయుడు-2’ తర్వాత సినిమాలు బంద్

  • భారతీయుడు 2 సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై
  • ఈ నెల 14 నుంచి షూటింగ్ ప్రారంభం
  • ఇకపై పూర్తిస్థాయి సమయం రాజకీయాలకే

తమిళ సూపర్ స్టార్ కమల హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రకటించిన ఆయన వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు.

1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘భారతీయుడు 2’ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు ప్రకటించి చిత్ర పరిశ్రమను ఆశ్చర్య పరిచారు. ఇదే తన ఆఖరి సినిమా అని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు చెప్పారు. ఈ సినిమా తర్వాత సినిమాల నుంచి తప్పుకుని తన పూర్తిస్థాయి సమయాన్ని రాజకీయాలకే కేటాయించనున్నట్టు కమల్ వివరించారు.

భారతీయుడు 2 సినిమా కథ కమల్ రాజకీయ జీవితానికి బూస్ట్ ఇచ్చేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. నయనతార పేరు ప్రస్తావనకు వచ్చినా చివరకు కాజల్‌నే ఖరారు చేశారు. కమల్ సినిమాలో అవకాశం లభించినందుకు కాజల్ ఉబ్బితబ్బిబ్బవుతోంది. కమల్‌తో తొలిసారి నటిస్తుందన్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.  .

  • Loading...

More Telugu News