Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరోసారి 'కవచం' కాంబినేషన్  
  • పూరీ జగన్నాథ్ తాజా చిత్రం 
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'ఎఫ్ 2'

*  తాజాగా రూపొందిన 'కవచం' చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ మళ్లీ అతనితో మరో చిత్రంలో కూడా జతకట్టనుంది. ఈ విషయాన్ని తనే మీడియాకు వెల్లడించింది. అయితే, ఆ చిత్రం వివరాలు మాత్రం చెప్పలేదు.
*  గత కొన్నాళ్లుగా విజయాలకు దూరమైన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని రామ్ హీరోగా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రకటన త్వరలో వెలువడనుంది.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 2' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.

  • Loading...

More Telugu News