Swiggi: నేతల నయా ప్లాన్... స్విగ్గి, ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్ వేషాల్లో డబ్బు బట్వాడా!
- తెలంగాణలో ముగిసిన ప్రచారం
- డబ్బులు పంచుతూ ఓటర్లకు ప్రలోభాలు
- డెలివరీ బాయ్స్ గా మారిన నేతల అనుచరులు
తెలంగాణలో ప్రచారం ముగిసిన తరువాత, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లు బయటకు తీసిన అభ్యర్థులు, డబ్బును బట్వాడా చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ యాప్ లైన స్విగ్గి, ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్స్ తరహాలోకి తమ అనుచరులను మార్పించి, చేర్చాల్సిన చోటికి డబ్బును చేరుస్తున్నట్టు తెలుస్తోంది.
డెలివరీ బాయ్స్ వాడే బ్యాగ్ లు, టీ షర్టులను వేయించి, డబ్బును, మద్యాన్ని, ఇతర బహుమతులను చేర్చాల్సిన చోటికి చేరుస్తున్నారు. తమ డబ్బును చేర్చాల్సిన చోటికి చేరిస్తే, భారీగా డబ్బిస్తామని చెబుతుంటే, కొందరు డబ్బుకు ఆశపడి డెలివరీ బాయ్స్ వేషాలు వేసుకుని హైదరాబాద్ లో తిరుగుతుండగా, పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు.