Telangana: ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం: రజత్ కుమార్
- ఓటరు గుర్తింపు కార్డులు లేని వారి కోసం కేంద్రాలు
- నిర్దేశించిన ఏదో ఒక గుర్తింపుపత్రం తప్పనిసరి
- దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాం
రేపు ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటరు గుర్తింపు కార్డులు లేని వారి కోసం సహాయకేంద్రాలు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో దాదాపు అందరికీ ఎపిక్ కార్డులు అందించామని, ఓటు వేయడానికి నిర్దేశించిన ఏదో ఒక గుర్తింపుపత్రం తప్పనిసరి అని, 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించారు.
ప్రతి ఓటరు తమ హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. దివ్యాంగులు ఓటు వేసేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, పోలింగ్ కేంద్రాల వరకు వారికి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని, వీల్ ఛైర్లు, రెయిలింగ్స్, ర్యాంప్ లు కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. కొన్ని చోట్ల మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశామని చెప్పారు.