Telangana: కొండారెడ్డిపల్లిలో రేవంత్.. జూబ్లీహిల్స్‌లో ఓటేసిన చిరంజీవి, నితిన్, బండ్ల గణేశ్!

  • ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
  • ఓటర్లతోపాటు క్యూలలో నిల్చున్న సినీ స్టార్లు
  • చాలా చోట్ల మొరాయించిన ఈవీఎంలు

ఈవీఎంల మొరాయింపు నడుమ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా, జోరుగా కొనసాగుతోంది. ఈ ఉదయం ఏడు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారి నుంచి వృద్ధుల వరకు పోలింగ్ కేంద్రాలలో బారులు తీరారు. అయితే, ఉదయం 9:20 గంటల వరకు రాష్ట్రంలోని 20 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు. 229 కేంద్రాల్లో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. కాగా, ఎన్నికల్లో పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులతోపాటు సినీ ప్రముఖులు కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకోగా, కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్,  నటులు చిరంజీవి, నితిన్, అల్లు అర్జున్, అక్కినేని నాగర్జున, అమల, వన్డే నవీన్ తదితరులు జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలో ఓటేశారు. అలాగే, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, జీహెచ్ఎంసీ కమిషన్ దానకిశోర్, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News