lagadapati: ప్రజాకూటమిదే అధికారం!: లగడపాటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
- ప్రజాకూటమికి 10 స్థానాలు అటూఇటుగా 65 స్థానాలు
- టీఆర్ఎస్ కు 10 స్థానాలు అటూఇటుగా 35 స్థానాలు
- బీజేపీకి 2 స్థానాలు అటూఇటుగా 7 సీట్లు
గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని మాజీ ఎంపీ లగడపాటి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. రెండు పక్షాలు కూడా అనేకమైన వాగ్దానాలు చేశాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో రెండు పక్షాలపై ప్రేమ, జాలి, కసి అన్నీ ప్రజల్లో కనపడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 10 స్థానాలు అటూఇటుగా 65 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ 10 స్థానాలు అటూ ఇటుగా 35 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంటుందని తెలిపారు.
టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో రెండు స్థానాలు అటూఇటుగా 7 గెలుస్తుందని లగడపాటి చెప్పారు. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుస్తారని ముందే చెప్పానని తెలిపారు. టీడీపీ పోటీ చేస్తున్న మరో స్థానంలో ఎంఐఎం బలంగా ఉందని అన్నారు. ఎంఐఎంకు 6 స్థానాలు వస్తాయని చెప్పారు. సీపీఎం ఒక స్థానంలో గెలుపొందే అవకాశం ఉదని చెప్పారు. బీజేపీ రెండు స్థానాలు అటూఇటుగా 7 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఇండిపెండెంట్లు 2 స్థానాలు అటూ ఇటుగా 7 స్థానాలను గెలుచుకుంటారని తెలిపారు.