depresure in bay of bengal: బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తున అల్పపీడన ద్రోణి
- నేటికి బలపడే అవకాశం
- కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి
- అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బలపడుతోంది. సోమవారం నాటికి 5.8 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శనివారం నాటికి 3.5 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అల్పపీడన ద్రోణి నేడు మరో రెండు కిలోమీటర్ల పైకి విస్తరించిందని తెలిపారు.
అల్పపీడనం మరింత బలపడినా తెలంగాణ రాష్ట్రంపై దీని ప్రభావం అంతగా ఉండదని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు తెలంగాణ మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.