KCR: తుది ఫలితాలను విడుదల చేసిన ఈసీ.. ఓట్ల షేరింగ్‌లోనూ దుమ్మురేపిన టీఆర్ఎస్
- 88 స్థానాల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి
- 46.9 శాతం ఓట్ల షేర్‌ను సొంతం చేసుకున్న టీఆర్ఎస్
- 28.4 శాతం దగ్గరే ఆగిపోయిన కాంగ్రెస్
మంగళవారం రాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు తెలంగాణలో పూర్తయింది. మొత్తం 119 స్థానాల ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 88 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకోగా, టీడీపీ రెండు, బీజేపీ 1, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఓ చోట విజయం సాధించారు.
పార్టీ పరంగా పోలైన ఓట్ల శాతాన్ని తీసుకుంటే.. టీఆర్ఎస్ మొత్తంగా 46.9 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 28.4 శాతం, బీజేపీ 7.0 శాతం, టీడీపీ 3.5 శాతం, ఇండిపెండెంట్లు 3.3 శాతం, ఎంఐఎం 2.7 శాతం, బీఎస్పీ 2.1 శాతం, ఎస్ఎంఎఫ్బీ 0.8 శాతం, ఏఐఎఫ్బీ 0.8 శాతం, బీఎల్ఎఫ్పీ 0.7 శాతం ఓట్లు సాధించాయి.
ఇక ఓట్ల పరంగా చూసుకుంటే టీఆర్ఎస్ 9700749, కాంగ్రెస్ 5883111, బీజేపీ 1450456, టీడీపీ 725845, స్వతంత్రులు 673694, ఎంఐఎం 561089, బీఎస్పీ 428430, ఎస్ఎంఎఫ్బీ 172304, ఏఐఎఫ్బీ 159141, బీఎల్ఎఫ్పీ 141432 ఓట్లు సాధించాయి.