kcr: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతి: కేసీఆర్

  •  విధివిధానాల రూపకల్పనపై ఓ కమిటీ వేస్తాం
  • నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు లు
  • తెలంగాణలో ఉద్యోగ ఖాళీలను వంద శాతం భర్తీ చేస్తాం 

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందజేస్తామని   కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి విధివిధానాల రూపకల్పనపై ఓ కమిటీ వేస్తామని చెప్పారు.

నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు వెళ్లేలా చేస్తామని అన్నారు. నిరుద్యోగులను మోసం చేసే పార్టీలు చాలా ఉన్నాయని, నాటి పాలకులు కాంగ్రెస్, టీడీపీ లు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. యువతకు మాయమాటలు చెప్పి మోసం చేశారు తప్ప, వారు చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణలో ఉద్యోగ ఖాళీలను వంద శాతం భర్తీ చేస్తామని, రాష్ట్రంలో పెట్టుబడుల వల్ల 2.5 లక్షల ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్ చివరి నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా ఉంటుందని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News