rafel: రాఫెల్ స్కాంపై నా సవాల్ కు కట్టుబడి ఉన్నా: రాహుల్ గాంధీ

  • రూ.1600 కోట్లకు రాఫెల్ డీల్ ఎలా కుదిరింది?
  • అనిల్ అంబానీకి ఈ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు?
  • ‘రాఫెల్’ పై జేపీసీ వేయాల్సిందే

రాఫెల్ స్కాంపై తన సవాల్ కు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాఫెల్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, రూ.1600 కోట్లకు రాఫెల్ డీల్ ఎలా కుదిరింది? రిలయన్స్ అధినేత అనిల్ అంబానీకి ఈ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానం లేదని అన్నారు. ‘రాఫెల్’ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని ఈ సందర్భంగా రాహుల్ మరోమారు డిమాండ్ చేశారు.

ఈ డీల్ కు సంబంధించిన వివరాలు ఇప్పటికే కాగ్ ద్వారా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)కి చేరాయని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, అలాంటి వివరాలేవీ కాగ్ కు చేరలేదని, తన వ్యాఖ్యలకు పీఏసీ చైర్మన్ గా ఉన్న మల్లికార్జున ఖర్గే వాదనే సాక్ష్యమని అన్నారు. పీఏసీ చైర్మన్ కు తెలియకుండా ఈ నివేదిక ఎలా ఉంటుంది? ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఉందా? కాగ్ నివేదిక ఎక్కడుందో చెప్పాలి? అని ప్రశ్నించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను మన పార్లమెంట్ లో కాకుండా ఫ్రెంచ్ పార్లమెంట్ లో ఏమైనా పెట్టారా? అని రాహుల్ నిప్పులు చెరిగారు. తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానాలు లేవని, దేశానికి కాపలాదారుని అని చెప్పుకుంటున్న మోదీ పెద్ద దొంగ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News