Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 199 మందిలో 158 మంది కోటీశ్వరులే!
- కాంగ్రెస్ పార్టీలో 82 మంది కోటీశ్వరులు
- 129 మంది డిగ్రీ ఆపైన చదివారు
- బీజేపీలో 58 మంది కోటీశ్వరులు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వారి ఆస్తుల తాలుకు నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) విడుదల చేసింది. ఏ ఏ పార్టీ నుంచి ఎందరు కోటీశ్వరులున్నారు? అలాగే ఎందరు గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారున్నారనే విషయాలను ఏడీఆర్ వెల్లడించింది. మొత్తంగా 199 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా వారిలో 59 మంది విద్యార్హత 5 నుంచి 12వ తరగతి మధ్యేనని స్పష్టం చేశారు.
129 మంది మాత్రం డిగ్రీ ఆపైన చదివారని వెల్లడించారు. ఇక 199 మందిలో 158 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 99 మంది ఎమ్మెల్యేలలో 82 మంది కోటీశ్వరులేనని తేలింది. బీజేపీకి చెందిన 73 మంది ఎమ్మెల్యేలలో 58 మంది, స్వతంత్రులు 11 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఆరుగురిలో ఐదుగురు కోటీశ్వరులేనని నివేదిక స్పష్టం చేసింది. వీరందరిలో కాంగ్రెస్కు చెందిన పరాస్రాం రూ.172 కోట్లతో అత్యంత సంపన్నుడని ఏడీఆర్ పేర్కొంది.