pethai: తుపాన్ల విశ్లేషణకు ప్రపంచంలోనే ఉత్తమ వ్యవస్థను సొంతంగా అభివృద్ధి చేసుకున్నాం: సీఎం చంద్రబాబు

  • మడ అడవులు తుపాన్ ప్రభావాన్ని తగ్గించాయి
  • గల్లంతైన 26 మంది జాలర్లలో 12 మంది సురక్షితం
  • పూర్తిస్థాయి అప్రమత్తతతో ప్రాణ, పశు నష్టం నివారించాం

తుపాన్లను విశ్లేషణ చేసేందుకు ప్రపంచంలోనే ఉత్తమ వ్యవస్థను సొంతంగా అభివృద్ధి చేసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పెథాయ్ తుపాన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పెథాయ్’ నేలను తాకిన చోట మన అడవులు తుపాన్ ప్రభావాన్ని తగ్గించాయని అన్నారు.

గల్లంతైన 26 మంది జాలర్లలో 12 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారని, 172 ప్రాంతాల్లో 6 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైందని చెప్పారు. తుపాన్ సమయంలో సెల్ టవర్లేవీ ఆగకుండా చూశామని, పూర్తిస్థాయి అప్రమత్తతతో ప్రాణ, పశు నష్టం నివారించామని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల బాధిత కుటుంబాలను తాను పరామర్శించలేదని పక్క జిల్లాల్లో ఉన్న ప్రతిపక్షనేతలు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు తాను వెళ్లానని విమర్శించే హక్కు వారికి లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News