Cold: మరింత పెరగనున్న చలి తీవ్రత... పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

  • పడిపోయిన సగటు ఉష్ణోగ్రతలు
  • హైదరాబాద్ లో 13 డిగ్రీలకు ఉష్ణోగ్రత
  • మరింత చలి తప్పదంటున్న అధికారులు

తెలుగు రాష్ట్రాలను చలిపులి చంపేస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదు డిగ్రీల వరకూ పడిపోయాయి. పెథాయ్ తుపాను ప్రభావంతో గడచిన నాలుగు రోజులుగా సూర్యుని దర్శనం లేకపోవడం, ఆకాశం మేఘాలతో నిండివుండటంతోనే వాతావరణం మరింతగా చల్లబడిందని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ లో రాత్రిపూట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోయింది. విశాఖ ఏజన్సీలో 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్, మందమర్రి ప్రాంతాల్లో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల పవనాలు కూడా చలిని పెంచుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News