Rajasthan: రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చీ రాగానే 40 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన కాంగ్రెస్
- రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముద్ర
- సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా కుల్దీప్ రంకా
- ఆయన స్థానంలో తన్మయి కుమార్
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలువురు బ్యూరోక్రాట్లను బదిలీ చేసింది. ఏకంగా 40 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పర్యాటక, అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కుల్దీప్ రంకాను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. అలాగే, అజితాబ్ శర్మ, రాజన్ విశాల్‌లను ముఖ్యమంత్రికి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలుగా నియమించింది. దీంతోపాటు ఆర్ఐఐసీఓ చైర్మన్‌గాను రంకా బాధ్యతలు తీసుకోనున్నారు. కుల్దీప్ రంకా స్థానంలో తన్మయి కుమార్‌ను నియమించింది.