India: ప్రతీ బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు ఇంకా ఎందుకు వేయలేదంటే..!: క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

  • డబ్బు వేసేందుకు మరింత సమయం పడుతుంది
  • కేంద్రం దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు
  • ఆర్బీఐని అడిగితే సహకరించడం లేదు

2014 సాధారణ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ చెప్పిన ఓ మాట బాగా హైలైట్ అయింది. విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని దేశానికి తీసుకురాగలిగితే, ప్రతి ఒక్కరి ఖాతాలోనూ 15 లక్షలు జమ చేయవచ్చంటూ అప్పట్లో మోదీ వ్యాఖ్యానించారు. ఈ హామీపై ప్రతిపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే స్పందించారు.

ప్రతీ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయడానికి ఇంకా సమయం పడుతుందని మంత్రి అథవాలే తెలిపారు. అయితే, ఒక్కసారిగా కాకుండా దఫదఫాలుగా ఈ మొత్తం దేశ పౌరుల ఖాతాల్లోకి చేరుతుందని అన్నారు. ప్రజలకు ఒక్కసారిగా ఇవ్వడానికి అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని వ్యాఖ్యానించారు. సాయం చేయాలని రిజర్వు బ్యాంకును కోరినా సానుకూలంగా స్పందించలేదని వాపోయారు.

 ఇక రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీనే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News