Rahul Gandhi: రాహుల్ బఫూనే.. తండ్రి వ్యాఖ్యలకు ఎంపీ కవిత వత్తాసు!
- లోక్ సభలో సిల్లీగా ప్రవర్తించేవారిని బఫూనే అంటారు
- దేశం కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు
- రాహుల్ కూటమిలో చేరబోమని వెల్లడి
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ కవిత సమర్థించారు. రాహుల్ ను కేసీఆర్ బఫూన్ అనడంలో తప్పేమీ లేదని కవిత వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో ప్రధాని మోదీని రాహుల్ ఎలా హగ్ చేసుకున్నారో దేశమంతా చూసిందన్నారు. పార్లమెంట్ లో సిల్లీగా ప్రవర్తించేవారిని బఫూన్ అనకపోతే మరేమంటారని ప్రశ్నించారు.
కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ను సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు. తమ ఎజెండా దేశ ప్రయోజనాల కోసమేనని వివరించారు. రాజకీయ పార్టీల మేలు కోసం కాదని అన్నారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన కూటమిలో మాత్రం టీఆర్ఎస్ చేరబోదని కవిత క్లారిటీ ఇచ్చారు.