Andhra Pradesh: చంద్రబాబు అబద్ధాల రాయుడు... ఇదిగో సాక్ష్యం: జీవీఎల్
- కేంద్రం నుంచి భారీ సాయం పొందుతున్న ఏపీ
- మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకే అధికం
- ట్విట్టర్ లో జీవీఎల్ నరసింహరావు
కేంద్రం నుంచి భారీ ఎత్తున సాయం పొందుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఆ విషయాన్ని అంగీకరించడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెడుతూ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి ఇళ్ల పథకంలో ఎంతో దక్కిందని, ఈ నిజాన్ని ప్రజలకు చెబితే, చంద్రబాబునాయుడు అబద్ధాల రాయుడని తేలిపోతుందని అన్నారు.
"ఆంధ్రప్రదేశ్ కు 'నరేంద్ర మోదీ పట్టణ ఇళ్ల పథకం'లో (పీఎంఏవై - అర్బన్) అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 9.6 లక్షల ఇళ్లు, రూ. 14,530 కోట్ల నిధులు కేంద్రం ఇచ్చింది. దేశంలో ఆరో భాగం కేవలం ఆంధ్రాకే. ఈ నిజాలన్ని ప్రజలకు ప్రధాన మంత్రి చెప్తే చంద్రబాబు నాయుడు అబద్ధాల రాయుడు అని తెలియదా?" అని వ్యాఖ్యానించారు. ఇదే ట్వీట్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని ఇళ్లను మంజూరు చేశామన్న విషయాన్ని చూపే పట్టికను ఆయన ఉంచారు.
ఆంధ్ర ప్రదేశ్ కు "నరేంద్ర మోడీ పట్టన ఇళ్ల పథకం"లో (PMAY-Urban) అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ 9.6 లక్షల ఇల్లు,14530 కోట్ల నిధులు కేంద్రం ఇచింది. దేశంలో ఆరో భాగం కేవలం ఆంధ్రాకే. ఈ నిజాలాన్ని ప్రజలకు ప్రధాన మంత్రి @narendramodi చెప్తే చంద్రబాబు నాయుడు అబద్ధాల రాయుడు అని తెలియదా?@ncbn pic.twitter.com/VgXvDnfszf
— GVL Narasimha Rao (@GVLNRAO) December 20, 2018