High Court: హైకోర్టు విభజనకు రంగం సిద్ధం.. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్
- ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం
- వారం క్రితమే రాష్ట్రపతి వద్దకు చేరిన ఫైల్
- 28 మంది న్యాయమూర్తుల్లో 14 మంది ఏపీకి, 11 మంది తెలంగాణకు
ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు రంగం సిద్ధమైంది. రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వారం క్రితమే ఈ ఫైలు రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది.
అయితే కొన్ని సందేహాల నేపథ్యంలో ఆ ఫైలును ప్రధాని కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి ఆ ఫైలును న్యాయశాఖ మంత్రికి పంపగా... అది అక్కడి నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్లింది. ప్రస్తుత ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ లను ఏ కోర్టుకు బదిలీ చేస్తారని కోవింద్ అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం.