Prime Minister: నా స్థానంలో సంతృప్తిగా ఉన్నాను...ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి

  • రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ముందుకురాను
  • గంగానది ప్రక్షాళన ప్రస్తుతం నా లక్ష్యం
  • ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌కు  కిశోర్‌ తివారి లేఖపై గడ్కరీ స్పందన

'ప్రస్తుతం నేనున్న స్థానంలో ఎంతో సంతృప్తిగా రాజకీయ జీవితాన్ని గడుపుతున్నాను. గంగానది ప్రక్షాళన వంటి బృహత్తర కార్యక్రమాన్ని నెత్తిన పెట్టుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నాను. అందువల్ల నరేంద్రమోదీ స్థానంలో రానున్న ఎన్నికల్లో ప్రధాని రేసులో ఉండాలన్న ఆసక్తి నాకు లేదు’ అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి స్పష్టం చేశారు.

మహారాష్ట్రకు చెందిన రైతు నేత, వసంతరావు నాయక్‌ సేఠ్ స్వావలంబన్‌ మిషన్‌ చైర్మన్‌ కిశోర్‌ తివారి ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌కు లేఖ రాస్తూ ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే నితిన్‌ గడ్కరిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి’ అని కోరిన విషయం తెలిసిందే. ఈ లేఖ అంశాన్ని ప్రస్తావించగా గడ్కరి ఈ విధంగా స్పందించారు. గంగానది ప్రక్షాళనతోపాటు రహదారుల విస్తరణ పనులపై తాను బోలెడంత సమయం వెచ్చించాల్సి ఉన్నందున ప్రధాని అభ్యర్థిత్వంపై  ఆసక్తి లేదని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News