t-congress: టీ-కాంగ్రెస్ ఎమ్మెల్సీల లేఖ ఆమోదం.. టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేస్తూ ప్రకటన!
- ఈ రోజు ఉదయం మండలి చైర్మన్ కి లేఖ
- ఈ లేఖను ఆమోదించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్
- ఈ మేరకు శాసనమండలి సెక్రటరీ ప్రకటన
టీ- కాంగ్రెస్ శాసన మండలి లెజిస్లేటివ్ పార్టీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖను మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆమోదించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, దామోదర్ రెడ్డి, సంతోష్, ప్రభాకర్ రావులు ఈ రోజు ఉదయం మండలి చైర్మన్ ని కలిసి ఓ లేఖ ఇచ్చారు. ఈ లేఖను స్వామిగౌడ్ ఆమోదించినట్టు శాసనమండలి సెక్రటరీ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, దామోదర్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరారు. నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ భేటీ అయిన విషయం తెలిసిందే.