nationla herald: రెండు వారాల్లో హౌస్ ఖాళీ చేయండి!: నేషనల్ హెరాల్డ్ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
- లీజును రద్దు చేస్తూ అక్టోబరు 30న కేంద్రం నోటీసుల జారీ
- కేంద్రం ఆదేశాలను పాటించాల్సిందేనన్న న్యాయమూర్తి
- లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి
నేషనల్ హెరాల్డ్‌కు 56 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన భవనాన్ని ఖాళీ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. రెండు వారాల్లోగా భవనాన్ని ఖాళీ చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ సునీల్‌గోర్ ఆదేశించారు. నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) హెరాల్డ్ హౌస్‌ను లీజుకు తీసుకుంది.
అయితే పత్రికా కార్యాలయం గత పదేళ్లుగా నడవడం లేదని, లీజు నిబంధనలు ఉల్లంఘించి వాణిజ్య కార్యకలాపాలకు ప్రాంగణాన్ని వినియోగిస్తున్నారని పేర్కొంటూ కేంద్రం లీజును రద్దు చేసింది. నవంబరు 17వ తేదీలోగా భవనాన్ని ఖాళీ చేయాలని అక్టోబరు 30న సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏజేఎల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది.