Telangana: హైదరాబాద్ లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన యువకుడు!

  • చిన్నారికి చాక్లెట్ ఆశచూపిన యువకుడు 
  • ఖాళీస్థలం వైపు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నం
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

మనుషుల్లో మానవత్వం నశించిపోతోందని చెప్పడానికి తాజా ఉదాహరణే ఇది. ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు సదరు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సనత్ నగర్ లోని ఫతేనగర్ ప్రాంతంలో బిహార్ నుంచి వచ్చిన ఓ జంట నివాసం ఉంటోంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె(4) స్థానికంగా ఉన్న పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం స్కూలు నుంచి ఇంటికొచ్చిన చిన్నారి ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. దీంతో ఇంజమాముల్ హక్(25) అనే యువకుడు బాలికపై కన్నేశాడు. చాక్లెట్లు కొనిస్తానని ఆశచూపి సమీపంలోని ఓ ఖాళీ స్థలం వైపు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు.

దీంతో బాధిత బాలిక గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు, బాలిక బంధువులు నిందితుడిని చావబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News