New Delhi: పొగమంచు కమ్మేసింది: ఒక్క విమానం కూడా కదల్లేదు... ఢిల్లీ ఎయిర్ పోర్టులో వేల మంది పడిగాపులు!
- న్యూఢిల్లీలో దట్టమైన పొగమంచు
- ఉదయం 7.30 నుంచి నిలిచిన సర్వీసులు
- ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
దట్టమైన పొగమంచు కారణంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఉదయం నుంచి ఒక్క విమానం కూడా టేకాఫ్ తీసుకోకపోవడంతో వేలమంది విమానాశ్రయంలో పడిగాపులు గాస్తున్నారు. ఈ ఉదయం 7.30 నుంచి విమానాలను నిలిపివేసినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
విమాన సర్వీసుల పునరుద్ధరణపై అధికారుల నుంచి మరో ప్రకటన వెలువడకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో న్యూఢిల్లీని కమ్మేసే పొగమంచుతో తరచూ ఇదే విధమైన సమస్య ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరంలో 12 రోజుల పాటు కనీసం 50 మీటర్ల దూరంలోని వాహనాలు కనిపించనంత పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. మరో 17 రోజుల పాటు 200 మీటర్ల దూరం కనిపించని పరిస్థితి నెలకొంది.