Petrol: ఏడాది కనిష్ఠానికి దిగొచ్చిన పెట్రోలు ధరలు!
- మంగళవారం నాడు పెట్రోలుపై 7 పైసల తగ్గింపు
- మారని డీజిల్ ధర
- ఢిల్లీలో రూ. 66.79కి లీటర్ పెట్రోల్
- 2018లో ఇదే అతి తక్కువ
ఈ సంవత్సరంలోనే అత్యంత కనిష్ఠానికి పెట్రోలు ధరలు చేరాయి. గత కొంతకాలంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటంతో ఆ ప్రభావం భారత్ పైనా కనిపిస్తోంది. మంగళవారం నాడు లీటరు పెట్రోలుపై 7 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించడంతో, ధరలు ఏడాది కనిష్ఠానికి చేరుకున్నాయి.
నేడు దేశ రాజధానిలో లీటరు పెట్రోలు ధర రూ. 66.79గా ఉండగా, కోల్ కతాలో రూ. 71.89, ముంబైలో రూ. 75.41, చెన్నైలో రూ. 72.41 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో డీజిల్ ధరను మాత్రం సవరించకుండా సోమవారం నాటి ధరనే కొనసాగిస్తున్నట్టు ఓఎంసీలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 2017 నాటి స్థాయికన్నా కిందకు జారాయి. దీంతో ఇండియాలో మరింతగా ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.