noida: పార్కులు, పబ్లిక్ ఏరియాల్లో నమాజ్ చేయవద్దు: నోయిడా పోలీసులు
- సెక్టార్ 58లో ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలకు నోటీసులు
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- తమ ఆదేశాలకు మతం రంగు పులమవద్దన్న పోలీసులు
ఢిల్లీ శివార్లలోని నోయిడా పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్కులు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో నమాజ్ చేయవద్దని ఆదేశించారు. ఈ మేరకు సెక్టార్ 58లో ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలకు నోటీసులను అందించారు. ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు పార్కుల్లో నమాజ్ చేయరాదని, ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే, ఈ ఆదేశాలు వివాదానికి దారి తీశాయి. కోర్టుకు వెళ్లేందుకు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అయితే, తమ ఆదేశాలకు మతం రంగు పులమవద్దని పోలీసులు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రాంతాల్లో నమాజ్ చేయడం వల్ల సామరస్యం దెబ్బతింటుందని కొన్ని హిందూ సంస్థలు నోయిడా ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. దీంతో, నోయిడా పరిధిలో ఉన్న 58 పోలీస్ స్టేషన్ల నుంచి కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి.