sharwanand: సుధీర్ వర్మతో శర్వానంద్ .. టైటిల్ పై జరుగుతోన్న కసరత్తు
- మాఫియా డాన్ గా శర్వానంద్
- 50 శాతానికి పైగా జరిగిన చిత్రీకరణ
- ఏప్రిల్లో విడుదల చేసే ఛాన్స్
శర్వానంద్ తాజా చిత్రంగా 'పడి పడి లేచె మనసు' థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా విడుదల కావడంతో శర్వానంద్ తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ తన తదుపరి సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తిచేశారు. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ఖరారు కాలేదు.
ఈ సినిమాలో శర్వానంద్ మాఫియా డాన్ గా కనిపించనుండటం వలన, 'దళపతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ ను వేరే నిర్మాత రిజిష్టర్ చేయించుకుని ఉండటం వలన, ప్రస్తుతం 'నాయకుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ టైటిల్ వలన ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగే ప్రమాదముందనే ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే టైటిల్ ను ఓకే చేసి, ఫస్టులుక్ ను విడుదల చేసేలా చూస్తున్నారు. ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.