Tollywood: జీఎస్టీ పన్ను బకాయిలు చెల్లించని హీరో మహేష్ బాబుకు నోటీసులు.. బ్యాంకు ఖాతాల సీజ్
- మహేశ్ కు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ నోటీసులు
- 2007-2008 ఆర్థిక సంవత్సరానికి బకాయిలు
- పన్ను, జరిమానా రూపంలో మొత్తం రూ.73.5 లక్షలు చెల్లించాలని నోటీసులు
ప్రముఖ హీరో మహేశ్ బాబుకు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ షాకిచ్చింది. గత తొమ్మిదేళ్లుగా ఎగవేస్తున్న పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుతూ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. వివిధ ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు, బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు అందించిన సేవలకు గాను లభించిన మొత్తంపై చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదని పేర్కొంది.
ఈ మేరకు మహేష్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 2007-2008 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని తెలిపింది. పన్ను, జరిమానా, వడ్డీల రూపంలో మొత్తం రూ.73.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు చెందిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసినట్టు జీఎస్టీ కమిషనరేట్ ప్రకటనలో పేర్కొంది.