Andhra Pradesh: చంద్రబాబూ.. దమ్ముంటే ముందు వాటిపై శ్వేతపత్రాన్ని విడుదల చెయ్!: సోము వీర్రాజు సవాల్

  • బీజేపీ ఎదగకూడదని అనుకుంటున్నారు
  • మోదీ వస్తున్నారనే శ్వేతపత్రాల విడుదల
  • ప్రధాని రాకను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, చేసిన ఖర్చులపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై బీజేపీ నేత సోము వీర్రాజు ఈరోజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ పర్యటనను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రాలో బీజేపీని ఎదగనివ్వకూడదన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1994 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు బీజేపీ అగ్రనేత దివంగత వాజ్ పేయిని వ్యతిరేకించారని గుర్తుచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల వేళ మోదీ, పవన్ కల్యాణ్ ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు కూడా ఏపీకి ప్రధాని వస్తున్నారన్న కారణంతోనే చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News