Telangana: ఈ ఏడాది తెలంగాణలో తగ్గిన హత్య కేసులు: డీజీపీ మహేందర్ రెడ్డి
- 4 శాతం తగ్గిన హత్య కేసులు
- 43 శాతం తగ్గిన చైన్ స్నాచింగ్ లు
- మీడియాతో మహేందర్ రెడ్డి
గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో 2018లో నమోదైన హత్య కేసులు 4 శాతం తగ్గాయని డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. ఈ ఉదయం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ సంవత్సరం క్రైమ్ రేట్ పై మాట్లాడారు. తెలంగాణ భద్రతపై తీసుకోబోయే చర్యలను వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఈ సంఖ్యను మరింతగా పెంచుతామని అన్నారు. రాష్ట్రంలో ఆస్తి తగాదాలు 8 శాతం తగ్గాయని అన్నారు. చైన్ స్నాచింగ్ లు 43 శాతం తగ్గాయని, మహిళలపై నేరాలు 7 శాతం, సైబర్ నేరాలు 3 శాతం తగ్గాయని చెప్పారు. ఈ సంవత్సరం 9,199 ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయని అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 6,012 మంది చిన్నారులను రక్షించామని మహేందర్ రెడ్డి తెలిపారు.