manohar parrikar: న్యూ ఇయర్ రోజున సెక్రటేరియట్ కు వచ్చిన పారికర్
- అనారోగ్య కారణాలతో నాలుగు నెలలుగా ఆసుపత్రి, ఇంటికి పరిమితమైన పారికర్
- సెక్రటేరియట్ వద్ద పారికర్ కు ఘన స్వాగతం
- ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్య కారణాలతో గత నాలుగు నెలలుగా ఆసుపత్రి, ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంగా ముక్కులో పైపు పెట్టుకుని ఉన్న ఆయనను చూసి అందరూ షాక్ అయ్యారు.
మరోవైపు, న్యూ ఇయర్ సందర్భంగా పారికర్ ఈరోజు సెక్రటేరియట్ కు వచ్చారు. ఉదయం 10.45కు సెక్రటేరియట్ లోని తన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సెక్రటేరియట్ కు చేరుకున్న బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో పారికర్ సమీక్ష నిర్వహించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ప్రమోషన్లు, బదిలీలపై చర్చించారు. సీఎం కార్యాలయ సిబ్బందితో కూడా ఆయన సమావేశమయ్యారు.