Chandrababu: చంద్రబాబు జోలికి మేం పోలేదు.. ఆయనే మా జోలికి వచ్చారు: దానం నాగేందర్

  • ఘోరంగా ఓడినా.. కాంగ్రెస్ నేతలకు సిగ్గు రాలేదు
  • ఓటమికి ఈవీఎంల సాకు చూపుతున్నారు
  • గాంధీభవన్ లో కాలు పెట్టనని చెప్పిన ఉత్తమ్ కుమార్ మాట తప్పారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ కు క్లారిటీ లేదని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారని... వారి ఫ్రంట్ కు ఏమి క్లారిటీ ఉందో చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. చంద్రబాబు జోలికి టీఆర్ఎస్ నేతలు వెళ్లలేదని... ఆయనే తమ జోలికి వచ్చారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ నేతలకు బుద్ధి రాలేదని అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించకుండా, ఈవీఎంల సాకు చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతే గాంధీభవన్ లో కాలు పెట్టబోనని చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట తప్పారని అన్నారు.
Chandrababu
danam nagender
Uttam Kumar Reddy
TRS
congress

More Telugu News