Cold: తిరుమలలో గణనీయంగా తగ్గిన రద్దీ... రెండు గంటల్లోపే దర్శనం!
- నిన్న కిటకిటలాడిన ఏడుకొండలు
- ఈ ఉదయం 2 కంపార్టుమెంట్లలో భక్తులు
- చలి పెరగడం కూడా కారణమే
ఓ వైపు చంపేస్తున్న చలిపులి, మరోవైపు దక్షిణాదిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతూ ఉండటంతో తిరుమల గిరుల్లో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. నిన్న జనవరి 1 సందర్భంగా కిటకిటలాడిన ఏడుకొండలు, నేడు బోసిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనం కోసం కేవలం రెండు కంపార్ట్ మెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. వీరికి మూడు గంటల్లోనే దర్శనం చేయిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక టైంస్లాట్, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సంక్రాంతి సెలవుల వరకూ రద్దీ కాస్తంత తక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.