India: ఫోర్లు, సిక్సులు... 500 దాటేసిన భారత స్కోర్!
- పంత్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన జడేజా
- సెంచరీకి చేరువైన పంత్
- స్కోర్ 6 వికెట్ల నష్టానికి 501 పరుగులు
ఈ ఉదయం పుజారా అవుట్ అయిన తరవాత రిషబ్ పంత్ తో జతకలిసిన రవీంద్ర జడేజా స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. ఇద్దరూ కలిసి ఓవర్ కు 5 పరుగులకు పైగా రన్ రేట్ ను నమోదు చేస్తూ ముందుకు సాగడంతో, భారత స్కోరు పరుగులెత్తింది. అదను చిక్కినప్పుడెల్లా బంతిని బౌండరీలకు తరలిస్తూ, భారత స్కోరును 500 పరుగులు దాటించారు వీరిద్దరూ.
ప్రస్తుతం రిషబ్ పంత్ 93 పరుగులు, రవీంద్ర జడేజా 30 పరుగుల వద్ద ఉన్నారు. భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 500 పరుగులు. స్కోరును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడం, పంత్ కు తన రెండో టెస్ట్ సెంచరీ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడంపై దృష్టిని పెట్టిన కోహ్లీ, అది పూర్తయిన తరువాత తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు ఆసీస్ ను కనీసం 15 నుంచి 20 ఓవర్లు బ్యాటింగ్ చేయించాలన్నది భారత్ వ్యూహం.