Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ఈ 8న నీటి సరఫరాకు అంతరాయం

  • ఆ రోజు ఉదయం 6 నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు
  • పంపింగ్‌ స్టేషన్లకు మరమ్మతులే కారణం
  • ప్రాంతాల వివరాలు వెల్లడించిన వాటర్‌ బోర్డు

పంపింగ్‌ స్టేషన్లలో మరమ్మతు పనులు చేపడుతున్న కారణంగా ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాలకు కుళాయి నీటి సరఫరా ఉండదని జీహెచ్‌ఎంసీ వాటర్‌ బోర్డు తెలిపింది. కృష్ణా నది నీటిని నగరానికి సరఫరా చేసే కోదండపూర్‌, నాసర్లపల్లి, గోడకండ్ల పంపింగ్‌ స్టేషన్లలో ట్రాన్స్‌కో పనులతోపాటు, ఫేస్‌-1 పైపులైన్‌ లీకేజీ మరమ్మతులు కూడా చేపట్టనుండడంతో ఈ అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. ఈ కారణంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నీటి సరఫరా బంద్‌ కానుంది.

దీంతో గంధంగూడ, బోజగుట్ట, ఆసిఫ్ నగర్‌, హబ్సీగూడ, నాచారం, తార్నాక, లాలపేట్‌, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, మీర్‌పేట్‌, షేక్‌పేట, మాదాపూర్‌, గచ్చిబౌలి, మూసారాంబాగ్‌, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్‌మెట్‌, శివం, చిలకలగూడ, అలియాబాద్‌, మీరాలం, కిషన్‌బాగ్‌లకు నీటి సరఫరా ఉండదు.

అలాగే, సాహెబ్‌నగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌, బాలాపూర్‌, బార్కాస్‌, మైసారం, బండ్లగూడ, రియాసత్‌నగర్‌, సంతోష్ నగర్, వినాయకనగర్‌, సైదాబాద్‌, ఆస్మాన్‌ఘడ్‌, చంచలగూడ, యాకత్‌పురా, మలక్‌పేట, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, బుద్వేల్‌, గోల్డెన్‌హైట్స్‌, సులేమానగర్‌, హైదర్‌గూడ, అల్లబండ, ప్రశాసన్‌నగర్‌, మౌలాలి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్‌, బోడుప్పల్‌, బీరప్పగూడ ప్రాంతాలకు కూడా నీటి సరఫరా నిలిచిపోనుందని వాటర్‌ వర్క్స్‌ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News