Andhra Pradesh: దేశంలోనే తొలిసారిగా సూళ్లూరుపేటలో భారీ తెరతో మల్టీప్లెక్స్.. ప్రపంచంలోనే మూడోది!
- రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్
- 106 అడుగుల వెడల్పుతో భారీ తెర
- అత్యాధునిక సౌకర్యాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ మల్టీప్లెక్స్ రూపుదిద్దుకోబోతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఇందుకు వేదిక కానుంది. చెన్నై-కోల్‌కతా రహదారిపై సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం వద్ద దేశంలోనే భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. 106 అడుగుల వెడల్పుతో భారీ తెర, 670 సీట్ల సామర్థ్యం, 3 డీ సౌండ్ సిస్టంతో దీనిని అత్యంత అధునాతనంగా నిర్మిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అనే సంస్థ రూ.40 కోట్ల వ్యయంతో ఏడున్నర ఎకరాల్లో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత వెడల్పైన తెరలతో కూడిన థియేటర్లు రెండే ఉండగా, ఇది మూడోది. ఆసియాలో రెండోది. ప్రస్తుతం నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌లో 170 సీట్ల సామర్థ్యం కలిగిన మరో రెండు స్క్రీన్లను కూడా నిర్మించనున్నారు.