Andhra Pradesh: వంగవీటి రంగా విగ్రహాన్ని తొలగించిన అధికారులు.. గుంటూరు జిల్లాలో టెన్షన్ టెన్షన్!
- అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- ప్రాణాలు అర్పిస్తామని హెచ్చరిక
- ఇంకా స్పందించని అధికారులు, నేతలు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనుల కోసం కాంగ్రెస్ మాజీ నేత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని తెనాలి మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఒక్కసారిగా పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. రంగా విగ్రహం తొలగించారని తెలుసుకున్న అభిమానులు, కాపునాడు నేతలు భారీగా అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. రంగా విగ్రహాన్ని తొలగించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘జై రంగా.. జైజై రంగా’ ‘విగ్రహం కోసం ప్రాణాలు ఇస్తాం’ అని నినాదాలు చేశారు. కాగా, ఈ విషయమై మున్సిపల్ అధికారులు, నేతలు ఎవరూ ఇంకా స్పందించలేదు.