Lakshmi`s NTR: ’లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఉద్దేశం ఇదే!: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
- అబద్ధాలను బండకేసి ఉతికి ఆరేయడమే ఈ చిత్రం లక్ష్యం
- నిజానికి అబద్ధమనే బట్టలు తొడిగారు
- వెన్నుపోటుదారుల బట్టలనీ చింపి పారేయడమే లక్ష్యం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని రెండోపాట ‘ఎన్టీఆర్..ఎన్టీఆర్.. జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణకుమారి, సావిత్రి, అంజలి దేవి..’ విడుదలైంది. ఈ పాట చివరల్లో ఈ చిత్ర దర్శకుడు వర్మ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్ధాలుగా చలామణి అవుతున్న నిజాలను, నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలను బండకేసి ఉతికి ఆరేయడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయం. ఇరవై సంవత్సరాలకు పైగా నిజానికి అబద్ధమనే బట్టలు తొడిగి, వీధులెంట తిరుగుతున్న వెన్నుపోటుదారులందరి బట్టలనీ ప్రజల కళ్ల ముందు చింపి అవతల పారేసి, నిజం బట్టలను ఒక్కొక్కటిగా, మెల్లగా విప్పి, దాన్ని పూర్తి నగ్నంగా చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశం’ అని వర్మ ఈ పాట చివర్లో వ్యాఖ్యానించడం గమనార్హం.