Washington: కుమార్తెను ఈడ్చుకుంటూ ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్
- లగేజీని లాక్కెళ్లినట్టు తీసుకెళ్లిన తండ్రి
- వెనకే అనుసరించిన చిన్నారి సోదరి
- నడవడం ఇబ్బందిగా అనిపించడం వల్లేనన్న తండ్రి
కుమార్తె హూడీ (స్వెట్టర్ లాంటి వాటికి ఉండే టోపీ లాంటింది) పట్టుకుని లగేజీని ఈడ్చుకెళ్లినట్టు విమానాశ్రయంలో లాక్కెళ్తున్న ఓ తండ్రి వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని వాషింగ్టన్ డ్యూల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. న్యూ ఇయర్ రోజున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. తండ్రి తనను లాక్కెళ్తున్నా ఆ చిన్నారి అరవడం కానీ, భయపడడం కానీ చేయలేదు. చేతిలో లగేజీతో ఆమె సోదరి వారిని అనుసరిస్తోంది. వీడియో వైరల్ కావడంతో తండ్రి స్పందించాడు. కుమార్తె తన వెనక నడవడం ఇబ్బందిగా అనిపించిందని అందుకే అలా లాక్కెళ్లానని వివరణ ఇచ్చాడు.