paruchuri: అప్పట్లో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ జోలె పట్టుకుని జనంలోకి వచ్చేశారు: పరుచూరి గోపాలకృష్ణ
- అప్పుడు మేము 'ఉయ్యూరు'లో వున్నాము
- ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి విపరీతమైన క్రేజ్
- దర్శకుడు క్రిష్ ను అభినందిస్తున్నాను
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో 'కథానాయకుడు' సినిమాను గురించి ప్రస్తావించారు. 'దివిసీమ' ఉప్పెన బాధితులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ జోలె పట్టుకుని విరాళాలను సేకరిస్తోన్న సమయంలో మేము 'ఉయ్యూరు'లో ఉన్నాము. ఆనాటి సంఘటనలను మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్లం. ఆ సన్నివేశాలను తెరపై చూస్తూ ఎంతో కనెక్ట్ అయ్యాము.
ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వాళ్లు బయటికి వస్తే కొన్ని లక్షల మంది మీదపడిపోతారు. ఆ విషయం తెలిసి కూడా వాళ్లు జనంలోకి రావడం .. జోలె పట్టుకుని తిరగడం మామూలు విషయం కాదు. అత్యున్నతమైన ఆ రెండు పాత్రలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అలా తెలుగు జాతికి వన్నె తెచ్చిన .. తెలుగు జాతికి మేలు చేసిన .. తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఒక మహా నటుడు .. ఒక మహానాయకుడిగా ఎలా పరివర్తన చెందాడు అనే అంశాన్ని ఆవిష్కరించారు. అందుకు నేను దర్శకుడు క్రిష్ ను ఎంతగానో అభినందిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.