Manmohan Singh: 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'పై రగడ: కోల్ కతాలో థియేటర్‌పై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
- సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి
- చూసిన మీదటే రిలీజ్ చేయాలి
- చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితాధారంగా రాసిన పుస్తకం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. తాము చూసిన మీదటే సినిమాను రిలీజ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయినా చిత్రబృందం ఇవేమీ పట్టించుకోకుండా శుక్రవారం ఈ చిత్రాన్ని విడుదల చేసింది. దీనిని చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు చాలాచోట్ల నిరసన వ్యక్తం చేశారు.
ఇక కోల్‌కతాలోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లోకి తమ పార్టీ జెండాలతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు చిత్రం ప్రదర్శితమవుతుండగానే తెరపైకి వస్తువులను విసరడంతో తెర చిరిగిపోయింది. మరోపక్క ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారు. చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చిత్రంలో తమ పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లను తీవ్రంగా అవమానించారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.